రెబల్ స్టార్ సినిమాలో మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్!

ఈ మధ్యకాలంలో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ‘సలార్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ‘ఆదిపురుష్’ మేకర్స్ కూడా సినిమా పనులు షురూ చేశారు. ఈ సినిమాలను పూర్తి చేసిన తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చేసింది.

ఈ సినిమాలో నటీనటులు కావాలంటూ చిత్రబృందం నుండి ప్రకటన వచ్చింది. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. డాన్స్, జిమ్నాస్టిక్స్ తెలిసి.. 9-14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు కావాలంటూ ప్రకటించారు. అలానే 20-35 ఏళ్ల మధ్య వయసున్న పురుష మార్షల్ ఆర్టిస్ట్ కూడా కావాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనను బట్టి చూస్తుంటే ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించి ఈ నెల 26న ఓ అప్డేట్ రాబోతుందని సమాచారం. ఆ రోజున సినిమాను లాంఛనంగా మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. లేదంటే కనీసం టైటిల్ అయినా ప్రకటిస్తారేమో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించనున్నారు.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus