Prabhas: డార్లింగ్‌ మరో సినిమా అనౌన్స్‌ చేస్తాడా..!

కొత్త సంవత్సరం దగ్గరపడుతుంది. ఇంట్లో గోడకున్న క్యాలెండర్‌ మార్చాలి. ఆ రోజు వచ్చే సినిమా అప్‌డేట్లు చూసి ఎంజాయ్‌ చేయాలి. ఇదేగా మీ ఆలోచన. అలాంటి అప్‌డేట్స్‌లో ఒకటి మీ ముందుంచుతున్నాం. ఇది టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ అందరికీ అప్‌డేటే. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి మాత్రం మాస్‌ అప్‌డేట్‌. అవును ఎందుకంటే ఫ్రభాస్‌ కొత్త సినిమా అందులోనూ, బాలీవుడ్‌ సినిమా గురించే ఈ అప్‌డేట్‌. ‘వార్‌’ సినిమా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో ఆ ముచ్చట వినిపించడం తగ్గింది. దీంతో ‘ఏంటి ఆ సినిమా ఉండదా?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే జనవరి 1న ఆ సినిమా గురించి హ్యూజ్‌ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందట. అవును మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ దీని గురించి ప్లాన్స్‌ వేస్తోందట. మైత్రీ మూవీ మేకర్స్‌ ఇన్నాళ్లూ తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చింది. తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే బాలీవుడ్‌ సినిమా మాత్రం ఇంకా ఓకే అవ్వలేదు.

ప్రభాస్‌ – సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబోలో ఆ సినిమా ఉంటుంది అని వచ్చిన పుకార్లు నిజమేనట. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌ చేస్తారు. దీంతో ప్రభాస్‌ లైనప్‌లో ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’తో పాటు మరో సినిమా యాడ్‌ అవుతోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus