ప్రభాస్ ఆ రెండు భారీ బడ్జెట్ సినిమాలను 2 ఏళ్ళలోనే ఫినిష్ చేసేస్తాడట…!

‘బాహుబలి2’ విడుదల అయ్యాక ప్రభాస్ నుండీ సినిమా రావడానికి రెండేళ్ల పైనే టైం పట్టింది. మళ్ళీ ‘సాహో’ వచ్చి ఏడాది పైనే అయిపోతుంది. మరో ఏడాది వరకూ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా రావడం కష్టమే. ఇలాంటి టైములో ప్రభాస్ మరో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్లో పెట్టాడు. ఒకటి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కాగా.. మరొకటి ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ కావడం విశేషం. ఈ రెండు చిత్రాలు పూర్తికావాలి అంటే.. ఒక్కో చిత్రానికి రెండేసి సంవత్సరాలు కేటాయించాల్సి ఉంది.

అలా అయితే 4 ఏళ్లకు కానీ పూర్తికావు. ఈ క్రమంలో ప్రభాస్.. రెండేళ్లలోనే రెండు సినిమాలు పూర్తిచేసేసాలా పక్కా ప్లాన్ ను రెడీ చేసుకున్నాడట. ఈ రెండు భారీ ప్రాజెక్టులకు ప్రభాస్ డేట్స్ ఇచ్చేసాడని తెలుస్తుంది. మొదట ‘ఆది పురుష్’‌ చిత్రం షూటింగ్ నాన్ స్టాప్ గా నెలరోజుల పాటు చేస్తాడట. అటు తరువాత ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్ వర్క్ మొదలుపెడతారట చిత్ర యూనిట్ సభ్యులు. దీనికి రెండు నెలల వరకూ టైం పడుతుందట. ఈ రెండు నెలల టైంను.. నాగ్ అశ్విన్ చిత్రం కోసం కేటాయిస్తాడట ప్రభాస్.

నాగ్ అశ్విన్ సినిమాకి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది. అది కూడా పూర్తవ్వాలి అంటే రెండేసి నెలల టైం పడుతుంది. ఈ టైంను మళ్ళీ ‘ఆదిపురుష్’ కోసం కేటాయిస్తాడట ప్రభాస్. అందుకే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నాన్ స్టాప్ గా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా అయితే రెండేళ్లలో ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఫినిష్ అయిపోతాయని తెలుస్తుంది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus