టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత నుండి ఆయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ వరుసగా సినిమాలు ప్రకటించాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా ఇతర భాష నిర్మాతలు నిర్మిస్తున్నవే. ‘ఆదిపురుష్’ సినిమాకి టీ-సిరీస్ భూషణ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సలార్’ సినిమాని కన్నడకి చెందిన హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.
ఒక్క నాగ్ అశ్విన్ సినిమాని మాత్రం తెలుగు నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మిగిలిన తెలుగు నిర్మాతలకు ప్రభాస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజానికి ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ ని సెట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఈ సినిమా కోసం మైత్రి వాళ్లు ప్రశాంత్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ప్రభాస్ మాత్రం మైత్రి సంస్థకి హ్యాండిచ్చాడు. అలానే దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తానని ‘బాహుబలి’ తరువాత మాటిచ్చాడు.
దీంతో దిల్ రాజు కొందరు దర్శకులను ప్రభాస్ దగ్గరకి తీసుకెళ్లాడు. కానీ ప్రభాస్ మాత్రం దిల్ రాజు ఆఫర్ ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ తనకు రూ.80 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు సినిమాను మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తీసే నిర్మాతలు, దర్శకులకే ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇలా లెక్కలేసుకొని మైత్రి, దిల్ రాజులను పక్కన పెట్టాడని టాక్. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!