చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్లకు ఎండ్ కార్డ్ పడింది. స్టార్ హీరోయిన్ సమంత,ఫ్యామిలీ మెన్ దర్శకుడు రాజ్ నిడిమోరు ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమం వేదికగా.. సోమవారం అంటే డిసెంబర్ 1న అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. అభిమానులకు పెద్దగా హింట్ ఇవ్వకుండానే సడెన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు.
పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులందరితో అంటే అత్తారింట్లో వాళ్లందరితో సమంత దిగిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో సామ్ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతోంది. అయితే ఈ ఫొటోను షేర్ చేస్తూ రాజ్ సోదరి శీతల్ రాసిన నోట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన సోదరుడు పెళ్లిని చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆమె తన పోస్ట్ ద్వారా స్పందిస్తూ…’ప్రదోష కాలంలో ఆ పరమశివుడిని ఆరాధిస్తున్న సమయంలో నాకు తెలియకుండానే కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చినవి కాదు.. కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శీతల్. సమంత రాకతో తమ కుటుంబం ఇప్పుడు పరిపూర్ణమైందని, రాజ్-సామ్ జంటను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
కొన్ని బంధాలు జీవితంలోకి ప్రశాంతతను తీసుకొస్తాయని, ఇది కూడా అలాంటిదేనని ఆమె అభిప్రాయపడ్డారు.మా కుటుంబం ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది, మా ఆశీర్వాదాలు మీకెప్పుడూ ఉంటాయి” అంటూ శీతల్ కొత్త జంటను దీవించారు. తన వదిన ఎమోషనల్ పోస్ట్‌పై స్పందించిన సమంత.. ‘లవ్ యూ’ అని కామెంట్ పెట్టి తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం సామ్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.