టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. తన రేంజ్ కి తగ్గట్లే ప్రభాస్ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో లిస్ట్ లో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలంతా.. రియల్ ఎస్టేట్ బిజినెస్ పై పెట్టుబడులు పెట్టేవారు.
అలానే ఇల్లు ఎక్కువగా కొనేవారు. కానీ ఈ జెనరేషన్ హీరోల బిజినెస్ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. ప్రభాస్ కూడా బిజినెస్ విషయంలో డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టబోతున్నారట. అది కూడా ఇండియాలో కాదు.. దుబాయ్, స్పెయిన్ లలో అని తెలుస్తోంది. అక్కడ భారీ మొత్తంతో హోటల్ ప్రాజెక్ట్స్ ను చేపడుతున్నారు. ఈ బిజినెస్ లో ప్రభాస్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు.
కానీ ఇందులో ప్రభాస్ మైనర్ స్టేక్ హోల్డర్ అని తెలుస్తోంది. కోవిడ్ సమయంలో హోటల్, రిసార్ట్స్ బిజినెస్ లో బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే మెల్లగా పంచుకుంటున్నాయి. మరి ఈ బిజినెస్ లో ప్రభాస్ కి ఏ రేంజ్ లాభాలు వస్తాయో..? మొత్తానికి ఫారెన్ బిజినెస్ లో పెట్టుబడులు విషయంతో వార్తల్లో నిలిచారు ప్రభాస్.
ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ రెండు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అలానే ‘స్పిరిట్’, మారుతి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!