తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మాణంలో ఇండస్ట్రీకి సూపర్ హిట్ చిత్రాలను పరిచయం చేశారు. ఈ విధంగా ఈ బ్యానర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు.
తాజాగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డర్టీ హరి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్మాత ఎమ్మెస్ రాజు ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలియజేశారు. ఇకపోతే తాను ఏ సినిమా చేసిన కథను నమ్మి సినిమా చేస్తానని స్టార్ హీరోలని నమ్మి సినిమాలు చేయనని తెలిపారు.
ఈ క్రమంలోనే చత్రపతి సినిమాలో ఎంతో మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్రభాస్ తో పౌర్ణమి సినిమా చేశారు.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వర్షం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పౌర్ణమి సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసాం. ఈ సినిమా కోసం కష్ట పడటం కన్నా ఈ సినిమా కోసం ప్రభాస్ తాను ప్రాణం పెట్టి పని చేశామని, అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని ఎం.ఎస్.రాజు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సినిమా విషయంలో కాస్త అసంతృప్తి మిగిలి ఉందని ఆయన తెలిపారు.అదే విధంగా తాను కథ బాగుంటేనే స్టార్ హీరోలతో సినిమా చేస్తానని లేదంటే స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చిన కూడా తాను సినిమా చేయనని ఆయన తెలిపారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!