రాజమౌళిని ఇలానే అన్నారు.. నాగీని ఇప్పుడు అంటున్నారు.. ఎందుకో?

‘బాహుబలి’ సినిమా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌ అవుతున్న సందర్భంలో టీమ్‌ నుండి అప్పుడప్పుడు వీడియోలు వస్తుండేవి. అలా ఓ సందర్భంలో రాజమౌళి పనితీరు విషయంలో టీమ్‌ చిరాకు పడిన వీడియోలు, బైట్లు వచ్చాయి. మీరు కూడా చూసే ఉంటారు. అవును, చూశాం.. అయితే ఏంటంట.. ఇప్పుడెందుకు అదంతా అని అనుకుంటున్నారా? ఇప్పుడు అదే తరహాలో నాగ్ అశ్విన్‌ను కూడా టీమ్‌ సభ్యులు విసుక్కుంటున్నారు. ఇదేదో పుకారు అనుకునేరు, నిజంగానే జరిగింది. దానికి సంబంధించిన వీడియోను టీమ్‌ అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది కూడా.

నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు, మిగిలిన దర్శకుల సినిమాలకు చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. ఆయన ఎంచుకునే ఎమోషన్స్‌, రిలేషన్స్‌, కాన్సెప్ట్స్‌.. ఇలా ఏవీ మిగిలిన హీరోలు చేయడానికి ముందుకు రారు అని ఘనంగా చెప్పుకోవచ్చు. అలాంటి నాగ్‌ అశ్విన్‌ అలియాస్‌ నాగీకి.. ఓ స్టార్‌ హీరో దొరికితే.. అది ‘ప్రాజెక్ట్‌ కె’ అవుతుంది. చాలా రోజుల క్రితం మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాను క్లోజ్డ్‌ ఫ్లోర్స్‌లో తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే. దీని కోసం ఇప్పటివరకు చూడని కార్లు, బైక్‌లు వాడుతున్నారు. వాటి కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆనంద్‌ మహీంద్రా సాయం కూడా తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇలా అప్పుడప్పుడు సమాచారం రావడం తప్ప.. సినిమా సంగతులు ఇంకేవీ రావడం లేదు. అయితే ఇప్పుడు నాగీ.. స్క్రాచ్‌ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. సినిమా కోసం టీమ్‌ ఎంత కష్టపడుతోంది. ఎలాంటి పనులు చేస్తున్నారు అనేవి చెప్పేలా ఓ చిన్న వీడియో రూపొందించారు. అందులో సినిమాలో నటించేవాళ్లు ఎవరూ లేరు, అంతా సినిమా కోసం పని చేస్తున్నవాళ్లే. కానీ ఆ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. దానికి కారణం అందులో చూపించింది ఓ టైరు తయారీనే. అవును కేవలం ఓ టైర్‌ కోసం నాగీ టీమ్‌ ఎంత కష్టపడ్డారు అనేది చూపించారు.

అంతేకాదు, ఈ క్రమంలో నాగీ గురించి తన టీమ్‌ ఏమనుకుంటున్నారు, టైర్‌ కోసం అంత కష్టం అవసరమా? అంటూ టీమ్‌ చేసే కామెంట్లు కనిపిస్తాయి. మీకూ ఇదే డౌట్ వస్తోందా? డౌట్‌ అయితే రావొచ్చు.. అయితే వీడియో చూస్తే ఆ డౌట్‌ కచ్చితంగా పోతుంది. అంతేకాదు ‘ప్రాజెక్ట్‌ కె’ మీద అంచనాలు మీకు ఇప్పటికే ఉంటే డబుల్‌, ట్రిపుల్‌ అవుతాయి. టైర్‌ కోసమే నాగీ అంత కష్టపడ్డారు అంటే సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థమవుతుంది. అన్నట్లు ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ బేస్‌ అని ఇంతకుముందే బయటికొచ్చింది. ఇప్పుడు ఈ టైర్‌ వీడియోతో మరోసారి క్లారిటీ వచ్చింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus