Radhe Shyam:’రాధే శ్యామ్’లో పూజా హెగ్డే రోల్ ఇదేనా..?

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలను ప్రభాస్ పై రీ షూట్ చేయబోతున్నారని సమాచారం. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే విక్రమాదిత్య ప్రేరణ పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో పెద్ద కార్ల కంపెనీకి ఓనర్ గా కనిపించనుండగా పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నారు. ఒక ప్రమాదం వల్ల సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే కలుస్తారని ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుందని తెలుస్తోంది. కథకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని సమాచారం. మరోవైపు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న వార్తల వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారని సమాచారం. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోగా రాధే శ్యామ్ వాయిదా పడుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus