టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు నెగిటివ్ టాక్ తో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం. ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఇటలీలో ప్రభాస్ ఒక విల్లాను రెంట్ కు తీసుకొని ఉన్నారని సమాచారం. ఈ విల్లా రెంట్ ఏకంగా 40 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. నెలరోజులకు ఈ మొత్తం చెల్లించాలని సమాచారం.
ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ కు ఈ మొత్తం ఎక్కువ మొత్తం కాదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ ఇల్లు వస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా ప్రభాస్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనని చెప్పవచ్చు.
ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అభిమానులు కోరుకున్న భారీ విజయాన్ని అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఇటలీ నుంచి ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తారో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఎన్నో వివాదాలు, విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రముఖ థియేటర్లలో మినహా, మిగతా థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఆదిపురుష్ సోమవారం కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది.
ప్రభాస్ కథ, కథనం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. వరుస విజయాలు దక్కేలా ప్రభాస్ జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రభాస్ కు ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం వరుస విజయాలు దక్కడం గ్యారంటీ అని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.