టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో పాపులారిటీ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో 70 రోజుల్లో సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అటు థియేట్రికల్ హక్కుల విషయంలో ఇటు నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో సలార్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి . అయితే అమెరికాలో సలార్ మూవీ సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.
అమెరికాలో ఏకంగా 1979 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఇది అమెరికాలో రికార్డ్ అని గతంలో ఈ స్థాయిలో అమెరికాలో విడుదలైన సినిమా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ క్రేజ్, పాపులారిటీకి ఇంతకు మించిన సాక్ష్యం అయితే అవసరం లేదని చెప్పవఛు. ఈ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా సలార్ కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ప్రభాస్ (Prabhas) పుట్టిన సంవత్సరం 1979 కాగా అన్ని స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. సలార్ సినిమా కథ కూడా 1979 సంవత్సరంలో మొదలవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లోని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో సలార్ మూవీ ఒకటి కాగా రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీ రాబోయే రోజుల్లో సైతం మరిన్ని సంచలన రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు