Prabhas, Kriti Sanon: మేడమ్ చెప్పేసారుగా… అలాంటిదేమీ లేదు క్లారిటీ ఇచ్చిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. అయితే ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అభిమానుల కోసం 29వ తేదీ రాత్రి ఈ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేశారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానుల సంఖ్య పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఆహా సైట్ క్రాష్ అయ్యింది.

అనంతరం కొంత ఆలస్యంగా ఈ ఎపిసోడ్ ప్రసారం కాగా ఇందులో బాలకృష్ణ ప్రభాస్ ఎన్నో ప్రశ్నలు అడిగారు ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి డేటింగ్ రూమర్ల గురించి బాలయ్య ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కృతి సనన్ ఇద్దరూ డేటింగ్ లోఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే బాలయ్య వీరిద్దరి డేటింగ్ పై ప్రభాస్ ను ప్రశ్నించారు. ఇలా బాలకృష్ణ ప్రశ్నించడంతో ప్రభాస్ సమాధానం చెబుతూ మేడం ఆల్రెడీ చెప్పేశారుగా…

అలాంటిది ఏమీ లేదు ఇది కేవలం పుకార్లు మాత్రమేనని ప్రభాస్ సమాధానం చెప్పారు. ప్రభాస్ ఈ విధంగా సమాధానం చెప్పడంతో బాలయ్య మాట్లాడుతూ మేడం ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? నేను కూడా నా భార్యను మేడం అని పిలుస్తాను అంటూ ప్రభాస్ ను మరోసారి ఇరికించేశారు.

మొత్తానికి ప్రభాస్ బాలకృష్ణ మధ్య కొనసాగిన ఈ కార్యక్రమం ప్రభాస్ ఫాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి.అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ కు భారీ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus