Prabhas: ప్రభాస్ ను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

ప్రభాస్ ఎంతో ఇష్టపడే వ్యక్తులలో ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఒకరు. కృష్ణంరాజు మరణవార్త విన్నప్పటి నుంచి ప్రభాస్ ఎంతో బాధ పడుతున్నారు. ప్రభాస్ ఏడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వాటిని చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతగానో బాధ పడటంతో పాటు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు, ఇతర కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయని సమాచారం. ఈ నెల 12వ తేదీన కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయనే సంగతి తెలిసిందే.

కృష్ణంరాజును కడసారి చూడటానికి అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశానికి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర తెలంగాణ సర్కార్ అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. అయితే కృష్ణంరాజును కడసారి చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ కోసం ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయించారు. సాధారణంగా అంత బాధలో ఉన్నవాళ్లు ఫ్యాన్స్ గురించి ఆలోచించలేరు. అయితే ప్రభాస్ మాత్రం అభిమానుల కోసం ఈ విధంగా చేయడంతో ప్రభాస్ నిజంగా గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాజు ఎక్కడున్నా రాజేనని ప్రభాస్ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అభిమానుల గురించి ఆలోచించడం ద్వారా ప్రభాస్ ఎంత మంచి మనిషో అర్థమవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ స్థాయిలో అభిమానులను గౌరవించే స్టార్ హీరోల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకునే విషయంలో కూడా ప్రభాస్ ముందువరసలో ఉంటారు. అయితే తను చేసిన సహాయాలను చెప్పుకోవడానికి ప్రభాస్ ఇష్టపడరు.

తన సినిమాలు ఫ్లాప్ అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ ను వెనక్కు ఇప్పించిన సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి. కృష్ణంరాజు సినీ పరిశ్రమలో అందరికీ తనకు చేతనైనంత సహాయం చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రభాస్ పెదనాన్నకు మరింత మంచి పేరు వచ్చేలా ఇండస్ట్రీలో సినిమాల ద్వారా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus