అభిమానులకోసం కోట్లు వదులుకున్న ప్రభాస్

బాహుబలి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. దేశవ్యాప్తంగా డార్లింగ్ కి  గుర్తింపు లభించింది. అతని నటనతో పాటు, గ్రీకు వీరుడు లాంటి ఫిట్ బాడీ చూసి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ ఫిట్ నెస్ కంపెనీ అనుకుంది. తమ ఉత్పత్తులు వాడాలని ప్రచారం చేస్తే భారీ మొత్తం చెల్లిస్తామని ఊరించింది.

అంగీకరిస్తే ఈ ఏడాదికి 5.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. వారి ప్రకటనకు ఒక రోజు నటిస్తే చాలు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లకు హాజరయితే సరిపోతుంది. కానీ ఆ అఫర్ ని వద్దనుకున్నారు ప్రభాస్. ఆర్టిఫిషల్ ఉత్పత్తులతో సిక్స్ ప్యాక్ లు సాధించాలనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సహజంగానే కండలు పెంచాలి. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని భారీ అఫర్ ని తిరస్కరించారు. ఆ ప్రకటనలో తాను నటిస్తే యువత ఎక్కువగా వాటిని వాడి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటారు.

అలా జరగ కూడదని యంగ్ రెబల్ స్టార్ కోట్లను కాదనుకున్నారు. తనకు డబ్బులు కన్నా, అభిమానులే ముఖ్యమని చాటారు.  ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus