Prabhas: ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ కి.. ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!

స్టార్ హీరోలు యాడ్స్ లో నటించడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి వారు యాడ్స్ లో నటించలేదు కానీ.. ఆ నెక్స్ట్ జెనరేషన్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు యాడ్స్ లో నటించారు. బాలకృష్ణ అయితే… కొంతకాలం నుండి యాడ్స్ లో నటిస్తున్నారు. ఇక ప్రెజెంట్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో నటిస్తుండగా… ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, విజయ్ దేవరకొండ, నాని వంటి వారు కూడా యాడ్స్ లో నటించారు.

పవన్ కళ్యాణ్ కూడా గతంలో పెప్సీ యాడ్ లో నటించారు. ఇక ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కూడా యాడ్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఎందుకో ఒక్కటి మాత్రమే చేసి ఆపేసారు. 2015 టైంలో ప్రభాస్ మహేంద్ర కారుని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ కోసం ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఎందుకంటే (Prabhas) ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.

ఇంకో రెండు, మూడు సినిమాలు క్లిక్ అయితే గ్లోబల్ స్టార్ కూడా అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అలాంటి హీరోతో ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే కోట్లల్లో పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం.. తాను చేసిన యాడ్ కు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. అదే సంస్థ యాడ్ చేయమని అడగ్గా.. అది చేయడానికి ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రభాస్ యాడ్స్ లో నటించకపోవడానికి కారణం.. అతను పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లనే అని చెప్పాలి.

https://youtu.be/9lgg_bUMpIU

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus