‘సలార్’ (Salaar) , ‘కల్కి..’ (Kalki 2898 AD) వంటి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ (Prabhas) . ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే సంగతి పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి చూపు పడింది. ట్రేడ్లో కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మారుతి (Maruthi) దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (The Rajasaab) చేస్తున్నాడు ప్రభాస్. కొంత పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.
మరోపక్క హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో కూడా ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ముందుగా ‘రాజా సాబ్’ అయితే వస్తుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘రాజా సాబ్’ సినిమాకి రూ.250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. ఇందులో ప్రభాస్ పారితోషికమే రూ.125 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంటే బడ్జెట్లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్న మాట. అయితే ప్రభాస్ అందుకునేది రూ.85 కోట్లు నుండి రూ.90 కోట్లు మధ్యలోనే ఉంటుంది అని తెలుస్తుంది.
ఎందుకంటే ‘ఆదిపురుష్’ (Adipurush) రైట్స్ ‘యూవీ’ వారి నుండి ‘పీపుల్ మీడియా’ వారికి ఇప్పించాడు ప్రభాస్. కానీ వాళ్లకి రూ.35 కోట్లు నష్టం వచ్చింది. అందువల్ల ప్రభాస్ తన పారితోషికం తగ్గించి ఇవ్వమని చెప్పాడట. అడ్వాన్స్ గా రూ.75 కోట్లు ఎప్పుడో ఇచ్చారట. ఇటీవల ఇంకో రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్టు వినికిడి. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టే.. ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంతా గొప్పగా చెబుతుంటారని స్పష్టమవుతుంది.