మంచు విష్ణు (Manchu Vishnu) కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ఇది అతని డ్రీం ప్రాజెక్ట్. అందుకే దీని విషయంలో చాలా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమాకి హీరో, నిర్మాత అతనే.అంతేకాదు కథ, స్క్రీన్ ప్లే విభాగంలో కూడా అతని పేరు వేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా క్యాస్టింగ్ సెలక్షన్ విషయంలో కూడా అతనే లీడ్ తీసుకున్నాడు. హిందీలో పలు సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
మోహన్ బాబు(Mohan Babu) కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సౌత్, నార్త్ కి చెందిన స్టార్స్ చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మోహన్ లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar).. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అందరూ ఎలా ఉన్నా.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ‘కన్నప్ప’ కి టికెట్లు తెగేది ప్రభాస్ పేరుతోనే అనడంలో సందేహం లేదు.
మరోపక్క ‘కన్నప్ప’ లో ప్రభాస్ (Prabhas) శివుడు పాత్రలో కనిపించబోతున్నట్టు మొదట్లో ప్రచారం జరిగింది. ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న వెంటనే విష్ణు.. ప్రభాస్ కి ఆఫర్ చేసిన పాత్ర ఇదే. కానీ ప్రభాస్ మాత్రం ఆ పాత్ర చేయను అని చెప్పినట్టు మంచు విష్ణు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తర్వాత నందీశ్వరుడుగా ప్రభాస్ నటిస్తున్నాడని కొన్నాళ్లపాటు ప్రచారం జరిగింది. ఫైనల్ గా రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు.
అయితే రుద్రుడు పాత్ర గురించి పురాణాల పై అవగాహన ఉన్నవారికి సైతం ఎక్కువగా తెలీదు. ‘కన్నప్ప’ లో ఈ పాత్రకి చాలా ఫిక్షన్ జోడించినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో శివుడు.. మారు రూపం ధరించి రుద్రుడుగా వస్తాడట. ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్నారు. ఆ పాత్ర మారురూపం అంటే ప్రభాస్ కనిపిస్తాడన్న మాట. ట్రైలర్లో ప్రభాస్ ని అందుకే స్పెషల్ గా చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు.