ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఎగిరినా, ఎంత తిట్టుకున్నా “సాహో” సినిమా ఓవరాల్ గా ఫ్లాప్ అయ్యింది అనేది పచ్చి నిజం. హిందీలో 150 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో మాత్రం కనీసం వంద కూడా వసూలు చేయలేక చతికిలపడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో నెం.1 ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇదివరకు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేర్కొన్న “అజ్ణాతవాసి” 65 కోట్ల నష్టం మిగిల్చి డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ చేత రక్త కన్నీరు పెట్టించగా.. ఇప్పుడు ఆ రికార్డ్ ను ప్రభాస్ “సాహో” బ్రేక్ చేసింది. దాదాపు 320 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఓవరాల్ క్లోజింగ్ కలెక్షన్స్ 222 కోట్లు. అంటే.. తక్కువలో తక్కువ 98 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశారు డిస్ట్రిబ్యూటర్స్. ఆల్ టైమ్ డిజాస్టర్స్ గా పేర్కొనే “స్పైడర్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు, బ్రహ్మోత్సవం” సినిమాలను కూడా సాహో క్రాస్ చేసింది.
ఈ విధంగా “బాహుబలి”తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్… “సాహో” బిగ్గెస్ట్ ఫ్లాప్ ను సొంతం చేసుకొని ఆ విధంగానూ నెం.1 స్థానంలో నిలిచాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం వరకూ పర్వాలేదు అనిపించుకొన్నా… వీకెండ్ హాలీడేస్ ముగిసిన తర్వాత కలెక్షన్స్ మాత్రం పుంజుకోలేదు. దాంతో “సాహో” బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి ఈ భారీ నష్టాలను ప్రభాస్ & యువీ క్రియేషన్స్ ఎలా కాంపన్సేట్ చేస్తారో చూడాలి…