Salaar Release Date: ఆ పండుగకు ప్రభాస్ ఫిక్స్ అయ్యారా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కేజీఎఫ్2 రిలీజ్ డేట్ కూడా అదేరోజు ఫిక్స్ కావడంతో సలార్ మూవీ రిలీజ్ ను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం 2022 దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది.

దసరాకు సినిమాను రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్లను సాధించే అవకాశం ఉండటంతో మేకర్స్ దసరాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సలార్ సినిమా ప్రభాస్ సినీ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో సలార్ ఒకటవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తుండగా కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఇతర రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పెరిగింది. ప్రభాస్ కొత్త కథలు కూడా వింటున్నారని రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus