Salaar 2: ఆ సమస్య వల్లే సలార్2 మూవీకి ఇబ్బందులు.. ఏం జరిగిందంటే?

  • May 25, 2024 / 07:24 PM IST

2023 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ గా సలార్ నిలవడంతో సలార్2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఎన్నో చిక్కుముడులతో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సలార్1 (Salaar) ను ముగించడంతో సలార్2 సినిమాపై క్రేజ్ అమాంతం పెరుగుతోంది. అయితే సలార్2 సినిమా అటకెక్కిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ (Prabhas) ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలంటే మరో మూడేళ్ల సమయం కచ్చితంగా పడుతుంది. మరోవైపు ఆగష్టు నెల నుంచి ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ మూవీ షూట్ మొదలుకానుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

దేవర మూవీ విడుదల కాకుండానే ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ బిజీ కానున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు సలార్2 గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదనే సంగతి తెలిసిందే. సలార్2 అటకెక్కిందంటూ వస్తున్న వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే సలార్2 మూవీ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ రియాక్ట్ అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ లోనే సలార్2 షూట్ మొదలవుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. ఇప్పట్లో సలార్2 మూవీ మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కు చాలా కాలం ఎదురుచూపులు అయితే తప్పవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సలార్2 ఎప్పుడు తెరకెక్కినా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాలో వార్ సన్నివేశాలు సైతం ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వచ్చే నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus