టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా నుంచి కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర అప్ డేట్ రానుంది. అయితే ప్రభాస్ ఈ ఏడాది జన్మదిన సంబరాలను జరుపుకోవడానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పుట్టినరోజు జరుపుకున్నా సింపుల్ గానే జరుపుకోవాలని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నెలరోజుల క్రితం అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ షూటింగ్ లలో పాల్గొంటున్నా ఆ బాధ నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదిపురుష్, సలార్ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.
ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మరో స్టార్ హీరో అయితే లేరనే చెప్పాలి.
ప్రభాస్ ను యంగ్ జనరేషన్ హీరోలలో కూడా చాలామంది అభిమానిస్తున్నారు. ప్రభాస్ కు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.