Prabhas: అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ లో ఇది గమనించారా?

స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి2 రిలీజ్ తర్వాత ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో సబ్ టైటిల్స్ తో అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. అయితే ఈ షో ద్వారా ప్రభాస్ కు సంబంధించిన షాకింగ్ సీక్రెట్ రివీల్ అయింది. ప్రభాస్ సాధారణంగా సోషల్ మీడియాలో అస్సలు కనిపించారు. ప్రభాస్ సోషల్ మీడియా ఖాతాలను సైతం ఆయన టీమ్ హ్యాండిల్ చేస్తుంది.

సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ తో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ప్రభాస్ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా అనే పదాన్ని ప్రభాస్ ఉపయోగించారు. ప్రభాస్ చేసిన కామెంట్ల ద్వారా సోషల్ మీడియాలో తన గురించి వచ్చే వార్తలు ప్రభాస్ కు తెలుసని క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ తనపై వచ్చే పాజిటివ్ కామెంట్స్ ను నెగిటివ్ కామెంట్స్ ను సోషల్ మీడియాలో గమనిస్తారని వెల్లడైంది.

ప్రభాస్ తనపై వచ్చే ప్రతి వార్త విషయంలో అప్ డేట్ అవుతూ నెగిటివ్ కామెంట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. సలార్, పాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ప్రాజెక్ట్ కే సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ 2000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ బాహుబలి2 ను మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అతి త్వరలో ప్రభాస్ అభిమానుల కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు ప్రభాస్ కు పెరుగుతున్న క్రేజ్ ను చూసి ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus