అనుకోకుండా ఖైరతాబాద్ లో దర్శనమిచ్చిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిన్న హైదరాబాద్ లో సందడి చేశారు. చాలా కాలం తరువాత బయట కనిపించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. సడన్ గా ప్రత్యక్షమైన ప్రభాస్ ని చూడడానికి ఫ్యాన్స్ పోటెత్తారు. దానితో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సందడి నెలకొంది. విషయంలోకి వెళితే ప్రభాస్ కొత్తగా ఓ కారు కొనుగోలు చేశారు. ఆ కారు రిజిస్ట్రేషన్ కొరకు ఖైరతాబాద్ నందు గల ఆర్టీఏ ఆఫీస్ కి ప్రభాస్ రావడం జరిగింది. ప్రభాస్ ని చూసిన ఆర్టీఏ సిబ్బంది మరియు అక్కడివారు ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు.

వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కి ప్రభాస్ ఖైరతాబాద్ లో ఉన్నారని తెలిసింది. దీనితో కొద్ది సమయంలోనే అక్కడికి గుంపులుగా ఫ్యాన్స్ వచ్చి చేరారు. ఇక ప్రభాస్ వారిని నిరుస్తాహ పరచకుండా వీలైనంత మందితో ఫోటోలు దిగారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ మాస్క్ ధరించి ఉన్నారు. ప్రభాస్ ఇచ్చిన ఈ సడన్ విజిట్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. ఇక ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాధే శ్యామ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ డ్రామా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే ఆత్రుత ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ప్రభాస్ తన 21వ చిత్రం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ నుండి రానున్నాయి.

1

2

3

 

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus