Prabhas Sreenu: ప్రభాస్ కోపం గురించి అలాంటి కామెంట్స్ చేసిన ప్రభాస్ శీను!

వెండితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ ప్రభాస్ శీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రభాస్ తో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఎప్పుడు ప్రభాస్ పక్కన కనిపించడం వల్ల తనకు ప్రభాస్ శీను అనే పేరు వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ శీను కాస్త సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ శీను తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ముఖ్యంగా తనకు ప్రభాస్ శీను అనే పేరు రావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. తాను ప్రభాస్ ఇద్దరు ఓకే యాక్టింగ్ స్కూల్లో చేరామని అప్పటికీ చాలామంది శ్రీనివాస్ అనేవ్యక్తులు ఉండటం చేత తాను ప్రభాస్ దగ్గర ఎక్కువగా ఉండటంతో తనకు ప్రభాస్ శీను అని పేరు పెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ ప్రభాస్ కి కోపం వస్తే చాలా సైలెంట్ గా ఉంటారని విన్నాము ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ప్రభాస్ శీను (Prabhas Sreenu) సమాధానం చెబుతూ సైలెంట్ కాదండోయ్ చాలా వైలెంట్ గా ఉంటారు.ప్రభాస్ కు కోపం వస్తే అసలు ఏమి మాట్లాడరు ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో కూడా మనకు అర్థం కాదు. ఇలా మాట్లాడకుండా చాలా బీభత్సమైన వైలెన్స్ సృష్టిస్తారని ప్రభాస్ శీను తెలిపారు.ఈ విధంగా కోపంలో ఉన్నటువంటి ప్రభాస్ ను తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలి అంటే చాలా టాలెంట్ కలిగి ఉండాలని అందుకే తాను ప్రభాస్ పక్కనే ఉన్నాను అంటూ సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఇక తాను పూరి జగన్నాథ్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేశానని ప్రభాస్ శీను తెలియజేశారు. ఇక పూరి గారితో అరగంటసేపు మాట్లాడితే నాకుపది రోజులకు కావలసినంత ఎనర్జీ వస్తుందంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రభాస్ శీను చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus