Prabhas Srinu: ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ శ్రీను క్లారిటీ.. అప్పుడే జరుగుతుందట!

స్టార్ హీరో బాలకృష్ణకు కోపం ఎక్కువని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే బాలయ్య నిజ స్వరూపం తెలిసిన వాళ్లు మాత్రం బాలయ్య మనస్సు బంగారం అని చెబుతారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ప్రభాస్ శ్రీను బాలయ్య గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి, ఇతర విషయాల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డైరెక్టర్ల సహకారం వల్లే 20 ఏళ్లలో 300 సినిమాలు చేశానని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

నా కామెడీ టైమింగ్ నచ్చడం వల్లే సినిమా ఆఫర్లు ఇచ్చారని ఆయన తెలిపారు. వైజాగ్ లో పుట్టానని శ్రీకాకుళంలో చదువుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. సినిమాల్లోకి వెళ్తానని చెబితే నల్లగా ఉన్నానని నన్ను వెక్కిరించే వాళ్లని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని అనుకుంటే నేను యాక్టర్ అయ్యానని ఆయన తెలిపారు. సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్ ద్వారా ప్రభాస్ తో పరిచయం ఏర్పడిందని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

నేను బాగా అల్లరి చేసేవాడినని ప్రభాస్ శ్రీను (Prabhas Srinu) చెప్పుకొచ్చారు. ప్రభాస్ చాలా వైలెంట్ అని కోపం వస్తే అస్సలు మాట్లాడరని ఆ సమయంలో ప్రభాస్ ను కూల్ చేయాలంటే చాలా టాలెంట్ కావాలని ఆ టాలెంట్ నాకు ఉందని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. రాజమౌళిది తండ్రి ప్రేమ అని వినాయక్ ది తల్లి ప్రేమ అని పూరీది గర్ల్ ఫ్రెండ్ ప్రేమ అని ప్రభాస్ శ్రీను అన్నారు. స్టార్ హీరో బాలయ్యతో పని చేయడం అద్భుతం అని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

బాలయ్యతో పని చేసే సమయంలో తొలిరోజు ఎంతగానో భయపడ్డానని అయితే చివరి రోజు మాత్రం ఏడ్చేశానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. మళ్లీ బాలయ్యతో ఎప్పుడు నటిస్తానో అని ఏడుపొచ్చిందని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ శ్రీను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జరిగేది ఎప్పటికైనా జరుగుతుందని ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus