Prabhas Srinu: ప్రభాస్ శ్రీనును గోపీచంద్ తిట్టారా.. ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యానని మార్కులు, అటెండెన్స్ లేక కాలేజ్ నుంచి బయటకు పంపించారని ఎలాగోలా మళ్లీ పాస్ అవ్వాలని అనుకున్నా అవ్వలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యానని పాసైనా సర్టిఫికెట్ మాత్రం రాలేదని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యానని ప్రభాస్ శ్రీను తెలిపారు.

నాన్న, శరత్ బాబు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అని ఆయన కామెంట్లు చేశారు. సినిమా రంగంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు. ఆ తర్వాత సత్యానంద్ గారి దగ్గరకు వెళ్లానని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను , అజయ్ ట్రైనింగ్ తీసుకున్నామని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. ప్రభాస్ గారు కారు, బైక్ ఉంటే మేలని ఊరికే వెళితే సినిమా ఆఫర్లు ఇవ్వరని చెప్పారని ప్రభాస్ శ్రీను అన్నారు. ఇండస్ట్రీ అంటే వేరేలా ఉంటుందని ఆయన చెప్పారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.

యాక్టర్ అయితే వెళ్లి కెరీర్ ను కొనసాగించాలని ప్రభాస్ చెప్పారని ప్రభాస్ శ్రీను అన్నారు. ప్రభాస్ తో సరదాగా ఉండాలే తప్ప ఇది నీ పోస్ట్ అని ఆయన చెప్పరని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆ రీజన్ వల్లే ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అంటారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. కొంతమంది డైరెక్టర్లు తిట్టి నాతో యాక్టింగ్ చేయించుకున్నారని ఆయన తెలిపారు.

నేను కెరీర్ విషయంలో ఫోకస్ చేయడం లేదని కెరీర్ తొలినాళ్లలో గోపీచంద్ తిట్టారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ గారిని నేను గురువుగారు అని పిలుస్తానని ప్రభాస్ శ్రీను తెలిపారు. మనం నటించిన సీన్స్ లో అన్ని సీన్స్ సినిమాలో ఉంటాయని చెప్పలేమని ప్రభాస్ శ్రీను అన్నారు. కెరీర్ తొలినాళ్లలో నాకు ప్లానింగ్ లేదని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. నేనేంటో నా భార్యకు పూర్తిగా తెలుసని ప్రభాస్ శ్రీను అన్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus