‘బాహుబలి'(సిరీస్) తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్నాడు. ‘ఆదిపురుష్’ ‘ప్రాజెక్ట్ కె’ ‘సలార్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమానే..! అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కు ఆ స్థాయిలో హిట్టిచ్చే సినిమా ఈ లిస్ట్ లో ఏదవుతుందో చూడాలి.
సినిమాల విషయాలు కాసేపు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ గురించి ఏమైనా మాట్లాడుకోవాలి అంటే అతని పెళ్లి టాపిక్ గురించే మాట్లాడుకోవాలి అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ‘నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో’ అని ఈ విషయంలో ప్రభాస్ ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చాడో.. అప్పటి నుండి అతను ఇక పెళ్లి చేసుకోడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు అతని అసిస్టెంట్ ప్రభాస్ శ్రీను.
‘సీతయ్య’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను ప్రభాస్ ఫ్యామిలీకి చాలా క్లోజ్. ప్రభాస్ వల్లనే ఇతను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని టాప్ కమెడియన్ గా ఎదిగాడు. కాబట్టి ఇతనికి ప్రభాస్ గురించి ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి. ‘ప్రభాస్ ను రాజు గారు అంటే.. ప్రభాస్ శ్రీనుని మంత్రి గారు’ అని కృష్ణంరాజు గారు అంటుండేవారట. ఇక ‘ప్రభాస్ చాలా మంచోడని. స్టార్ అవ్వకముందు.. స్టార్ అయ్యాక.. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక కూడా అతను ఒకేలా ఉన్నాడని..
ఇమేజ్ పెరిగేకొద్దీ మారాలనే తపన అతనిలో ఉండదని ప్రభాస్ శీను తెలిపాడు. ప్రభాస్ బలహీనత గురించి చెబుతూ.. ‘అతని మంచితనమే అతనికి ప్లస్. మైనస్ కూడా అదే. అతనికి కనుక ఎవరి పై అయినా కోపం వస్తే అసలు వాళ్ళతో మాట్లాడడు. అతని నవ్వు ఎంత బాగుంటుందో.. అతని సైలెన్స్ అంతకుమించి భయంకరంగా ఉంటుంది. అందుకే అతనితో సాధారణంగా ఎవ్వరూ గొడవపడరు’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?