ఒకప్పుడు బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాని, తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున(Nagarjuna), వెంకటేష్(Venkatesh Daggubati) వంటి స్టార్లు అప్పుడప్పుడు.. అక్కడ మెరుపులు మెరిపించినా పట్టించుకుంది అంటూ ఏమీ లేదు. కానీ ‘బాహుబలి'(Baahubali) తర్వాత బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమా వైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ముఖ్యంగా ప్రభాస్ ను (Prabhas) నార్త్ జనాలు బాగా ఓన్ చేసుకున్నారు.
అతని తర్వాతి సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. అటు తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’(RRR) తో ఎన్టీఆర్, చరణ్ (Ram Charan), ‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) తో అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారు కూడా నార్త్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) , రాంచరణ్..ల సినిమా అక్కడ అంతగా ఆడలేదు. అల్లు అర్జున్ సంగతి అప్పుడే ఏమీ చెప్పలేము.పుష్ప రాజ్ పాత్రని నార్త్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు కానీ…
అల్లు అర్జున్ ను వాళ్ళు ఓన్ చేసుకున్నారా అంటే అప్పుడే కచ్చితంగా అవునని చెప్పడం సరికాదు. అయితే ప్రభాస్ విషయంలో అలా కాదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ (Prabhas) చేసిన ‘సాహో’ (Sahoo) అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ‘ఆదిపురుష్’ (Adipurush) కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ (Salaar) ‘కల్కి’ (Kalki 2898 AD) ..ల సంగతి చెప్పనవసరం లేదు. అందుకే ఇప్పుడు మిగతా హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలంటే..
అక్కడ వాళ్ళు స్ట్రైట్ సినిమాలు చేయాలి. ‘వార్ 2’ (War 2) లో సెకండ్ హీరో రోల్ ఎన్టీఆర్ చేస్తుండటాన్ని బట్టి.. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ (Aamir Khan) ‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు చర్చ నడుస్తుంది. రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో (Salman Khan) కలిసి ఒక సినిమా చేయడానికి ఎప్పుడో ఓకే చెప్పాడు. అదీ మేటర్