Prabhas: ఆ సమస్య కారణంగానే ఆది పురుష్ ప్రమోషన్లకు ప్రభాస్ దూరం!

  • June 19, 2023 / 05:27 PM IST

సాధారణంగా సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోని చిత్ర బృందం, హీరో, హీరోయిన్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి మిశ్రమ స్పందన దక్కించుకుంది.

ఇలా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న తరుణంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాల్సింది పోయి చిత్ర బృందం ఎవరూ కూడా ఒక్క ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు అలాగే ప్రభాస్ సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు. ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలోనే ఈయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక పూర్తి కాగానే ప్రభాస్ అమెరికా వెళ్లిపోయారు. అయితే అమెరికాలో ఈయన మోకాలి సర్జరీకి సంబంధించిన చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లారని తెలుస్తోంది. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయం కావడంతో ఇప్పటికీ అది తనని వెంటాడుతూనే ఉందని సమాచారం. ఈ విధంగా మోకాలినొప్పి సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రభాస్ అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారని మరికొద్ది రోజులపాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈయన తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇలా మోకాలి నొప్పి సమస్య కారణంగానే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఈయన నటిస్తున్న సలార్ సినిమా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే,స్పిరిట్ మారుతి డైరెక్షన్లో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus