కోహ్లీ భార్య కాదు… స్వీటీ అనుష్కే సీత!

ప్రభాస్‌తో అనుష్క శెట్టిది హిట్ కాంబినేషన్. కాదు కాదు, సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ‘బిల్లా’ టు ‘బాహుబలి’ ఈ జోడి ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసింది. ‘రామాయణం’ ఆధారంగా రూపొందిస్తున్న ‘ఆది పురుష్’లో కూడా ఎంటర్టైన్ చెయ్యనుందట. అందులో సీతగా దేవసేన యాక్ట్ చెయ్యనుందట. సీతగా అనుష్కే కావాలని ప్రభాస్ అంటున్నాడట. ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి వార్తల్లో నిలుస్తోంది. రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ యాక్ట్ చేస్తుండటం ఒక విశేషం అయితే, ఒక అప్డేట్ తరవాత మరో అప్డేట్‌తో యూనిట్ సినిమాపై క్రేజ్ పెంచుతోంది. ఈ సినిమాలో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీత ఎవరనే క్వశ్చన్ మొదలైంది. సీతగా కీర్తీ సురేష్, కియారా అద్వానీ, ఉర్వశీ రౌటేలా పేర్లు ప్రచారంలోకొచ్చాయి.

లేటెస్టుగా అనుష్క పేరు వచ్చింది. అయితే, ఆ అనుష్క ఎవరు? అని కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అనుష్కలు ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫ్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్, దేవసేన అనుష్క శెట్టి ఒకరు. ఇద్దరిలో సీతగా యాక్ట్ చేసే అనుష్క ఎవరు? కొందరు శర్మ అంటుంటే, మరికొందరు శెట్టి అంటున్నారు. ఎట్ ప్రజెంట్ అనుష్క శర్మ ప్రెగ్నెంట్. జనవరిలో డెలివరీ అని అనౌన్స్ చేసింది.

‘ఆదిపురుష్’ షూటింగ్ జనవరిలో స్టార్ట్ కానుంది. డెలివరీ అయిన వెంటనే యాక్టింగ్ చేస్తుందా? అనేది కొందరి అనుమానం. మూడు నాలుగు నెలలు రెస్ట్ తీసుకుని రావాలని అనుకున్నా చంటిబిడ్డను వదిలి లొకేషన్ కి రావడం కష్టమే. సో, సీతగా యాక్ట్ చేసేది అనుష్క శెట్టి అని అంటున్నారు. పైగా, ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా ప్రభాస్, అనుష్క జోడీకి క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని డైరెక్టర్ ఓం రౌత్, ప్రొడ్యూసర్ టీ-సిరీస్ భూషణ్ కుమార్ అనుకుంటున్నారట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus