పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja saab) సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. దర్శకుడు మారుతి (Maruthi Dasari) తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ప్రమోషనల్ పోస్టర్ల వరకు ప్రతీ అంశం ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వీరు ముగ్గురూ ప్రభాస్‌తో కలిసి మాస్ ఎలిమెంట్స్‌కు తగిన సన్నివేశాల్లో కనిపించనున్నారు.
ముఖ్యంగా ఒక ప్రత్యేక పాటలో వీరు ప్రభాస్‌తో కలిసి తెరపై మెరుస్తారని తెలుస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాలు కథకు ప్రధాన హైలైట్ కానున్నాయి. అయితే, ఇప్పటివరకు 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. ఇంకా 80 రోజుల వర్క్ మిగిలి ఉందని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, ఈ టార్గెట్‌ను చేరడం కష్టసాధ్యమవుతుందనే టాక్ వినిపిస్తోంది.
మారుతి ఈ చిత్రానికి అందించిన కథ పక్కాగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. అలాగే, ప్రభాస్ కూడా పాత్రలో కొత్తదనం కోసం కష్టపడుతున్నారట. సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లతో ఇప్పటివరకు అంచనాలు పెంచిన టీమ్, ఈ చిత్రం విడుదలను వాయిదా వేయకుండా ప్రయత్నిస్తోందట. ‘ది రాజా సాబ్’ టీమ్ జూన్ లో విడుదల చేసేందుకు కొత్త డేట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రేక్షకులకు గ్లామర్, హారర్, కామెడీ కలగలిపిన ప్యాకేజీ అందించాలన్నది వారి లక్ష్యం. మరి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అనుకున్న గడువు లోపల పూర్తి అవుతుందా, లేదంటే వాయిదా పడుతుందా అనేది చూడాలి.