Kannappa: విష్ణుకే కాదు ఫ్యాన్స్ కి కూడా షాకిచ్చేలా ఉన్నాడు!

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa)  పై ప్రేక్షకుల దృష్టి ఉంది. ఎందుకంటే ఇందులో చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. మంచు విష్ణు హీరో అయినప్పటికీ.. అందరి ఫోకస్ ఈ సినిమాపై పడటానికి కారణం అదే. మోహన్ లాల్ (Akshay Kumar) , శివరాజ్ కుమార్(Shiva Rajkumar), అక్షయ్ కుమార్ (Akshay Kumar).. వంటి స్టార్స్ నటిస్తున్నారు. వీళ్ళతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  కూడా ఇందులో నటిస్తున్నాడు. ‘కన్నప్ప’ కి బిజినెస్ జరుగుతుంది ప్రభాస్ పేరుపైనే.

Kannappa

ఇక రిలీజ్ రోజున ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. అది ప్రభాస్ బ్రాండ్ పైనే అనడంలో కూడా సందేహం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ‘నంది’ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ పాత్రకు సంబంధించిన పిక్స్ లీక్ అవ్వడం.. అవి వైరల్ అవ్వడం అందరూ చూశారు. ఒక రకంగా అవి సినిమాపై అంచనాలు పెంచాయి అని కూడా చెప్పాలి. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ వల్లనైనా ప్రభాస్ ని చూడొచ్చు, అతని మాటలు వినొచ్చు అని ఆశపడుతున్నారు.

‘కన్నప్ప’ కి మరింత మైలేజీ చేకూర్చడానికి కూడా అది చాలా అవసరం. మంచు విష్ణు కూడా ప్రభాస్ ను నమ్ముకుని 2 ఈవెంట్లు కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రభాస్ వాటికి అటెండ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ప్యాచ్ వర్క్ షూటింగ్లో పాల్గొంటాడట. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi) ‘ఫౌజీ’ షూటింగ్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అందుకే ‘కన్నప్ప’ కి ప్రభాస్ హ్యాండిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus