Prabhas. Koratala Siva: అలా అయితేనే ప్రభాస్- కొరటాల కాంబోలో సినిమా తెరకెక్కుతుందట..!

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి పరాజయం పాలైంది. మరోపక్క ‘ఆది పురుష్’ ‘సలార్’ ‘స్పిరిట్’ వంటి బడా చిత్రాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ‘ఆదిపురుష్’ ప్రభాస్ కు 22వ సినిమా కావడం విశేషం. మధ్యలో నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ 21గా అనౌన్స్ చేశారు నిర్మాతలైన వైజయంతి మూవీస్ వారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సలార్.. ప్రభాస్ కు 23వ సినిమా అన్న సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

మారుతీ డైరెక్షన్లో చేయబోయేది 24వ సినిమా అనుకుంటే 25వ సినిమా ‘స్పిరిట్’ అని క్లారిటీ వచ్చింది. అయితే దిల్ రాజు నిర్మాణంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి డైరెక్టర్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు అంటూ ప్రస్తుతం వార్తలు మొదలయ్యాయి. ఇటీవల ప్రభాస్ సర్జెరీ నిమిత్తం స్పెయిన్ వెళ్ళాడు. అతని భుజానికి గాయం అవ్వడంతో సర్జెరీ అవసరమని వైద్య నిపుణులు సూచించారు.

దాంతో ప్రభాస్ స్పెయిన్ వెళ్లడం జరిగింది. అయితే స్పెయిన్ వెళ్ళే ముందు ప్రభాస్..దర్శకుడు కొరటాల శివని మీట్ అయ్యారు. ఆయన ఓ కథ చెప్పడం అది ప్రభాస్ కు నచ్చడం జరిగింది. అయితే ప్రభాస్ కు ‘యూవీ క్రియేషన్స్’ వారితో ఇంకో సినిమా చేయాలని ఉంది. ‘రాధే శ్యామ్’ నష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో వారి నిర్మాణంలో ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కొరటాల మాత్రం ఇందుకు సిద్ధంగా లేరట.

దానికి గల కారణాలు ఏంటి అన్నది బయటకి రాలేదు. దిల్ రాజు లేదా మైత్రి వారి నిర్మాణంలో సినిమా చేయడానికి కొరటాల రెడీగా ఉన్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వడానికి చాలా టైం పడుతుంది.’ఆచార్య’ తర్వాత కొరటాల ముందుగా ఎన్టీఆర్ ప్రాజెక్టు ఫినిష్ చేయాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus