వావ్.. అలా అయితే ‘బాహుబలి’ కి మించి ఉంటుందేమో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించబోతున్నాడు. సుమారు 350 నుండీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ ఓ యూనిక్ సబ్జెక్టు ను రెడీ చేసాడట. అందుకే సింగిల్ సిట్టింగ్ లో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ‘నాగ్ అశ్విన్ చిత్రంతో పాన్ వరల్డ్ స్టార్ అవుతాడని’.. దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని సమాచారం. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేసారు. ఇందులో భాగంగా ఈ చిత్రానికి.. హాలీవుడ్ విజువల్ వండర్ అయిన ‘అవెంజర్స్’ కు పనిచేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రభాస్ సినిమా ఉండబోతుందన్న మాట. అదే కనుక జరిగితే ‘బాహుబలి’ ని మించి ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా ఉండబోతుందని ఆశించవచ్చు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొదట దీపికా పేరు వినిపించింది. ఆ తరువాత కియారా అన్నారు. మరి ఎవరిని ఫైనల్ చేశారన్నది ఇంకా ప్రకటించలేదు.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus