హాలీవుడ్ లో 2016లో రెండు థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. 1) లైట్స్ ఔట్, 2) డోన్ట్ బ్రీత్. ఈ రెండు సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ తరహా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ఇండియన్ ఫిలిమ్స్ మాత్రం రాలేదు.ఆ లోటు తీర్చేందుకు కంకణం కట్టుకొన్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. ప్రభుదేవా (Prabhu deva) ముఖ్యపాత్రలో “మెర్క్యురీ” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మూకీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భాష ప్రోబ్లమ్ లేకపోవడంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 13న విడుదలకానుంది.
సౌత్ ఇండియాలో వస్తున్న మొట్టమొదటి సైలెంట్ హారర్ ఫిలిమ్ కావడంతో ఈ చిత్రంలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇవాళ విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మెర్క్యురీ లీకేజ్ కారణంగా నాశనం అయిపోయిన ఒక ఊళ్ళోకి వెళ్ళిన ఒక గ్యాంగ్ మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది సినిమా కాన్సెప్ట్. తక్కువ క్యారెక్టర్స్ తో కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ప్రధానాకర్షణలుగా విడుదలవుతున్న ఈ తరహా చిత్రాలు సక్సెస్ అయితే భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి.