Prabhu Deva: మొదటిసారి తెరపైకి వచ్చిన ప్రభుదేవా రెండో భార్య!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభుదేవా గురించి అందరికీ సుపరిచితమే. సుందరం మాస్టర్ కుమారుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అనంతరం నటుడిగా మారి నటనలో కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. అనంతరం దర్శకుడిగా మారి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇకపోతే ప్రభుదేవా కెరియర్ ఎంతో మంచి సక్సెస్ గా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో పలు వడిదుడుకులు ఉన్నాయని చెప్పాలి.

మొదట వివాహం చేసుకొని పిల్లలకు జన్మనిచ్చి తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా ప్రభుదేవా ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో పడ్డారు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తన భార్యకు కూడా విడాకులు ఇచ్చారు. చివరికి ఆ హీరోయిన్ తో కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చివరికి ఒంటరిగా మిగిలిన ప్రభుదేవా రెండవ వివాహం చేసుకున్నారు.

అయితే తన రెండవ భార్యను ఎప్పుడూ ఎక్కడ బయటకు తీసుకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే తాజాగా మొదటిసారి ప్రభుదేవా రెండవ భార్య మొదటిసారి తెరపైకి వచ్చారు. ప్రభుదేవా 2020వ సంవత్సరంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానిని వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రభుదేవా 50వ పుట్టినరోజు సందర్భంగా ఈమె తనకు శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ‘మీతో మూడేళ్ల ప్రయాణం..అద్భుతమైన జర్నీ. మీరు ఎంతో జాయ్ ఫుల్ పర్సన్.నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’అంటూప్రభుదేవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus