యూత్ మెచ్చే సినిమాల వైపు అడుగులేస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. యువత నచ్చే కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆ వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఇందులో చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్న హీరో హీరోయిన్ లుక్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో స్పెషల్ అయితే ఉందని అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం మాట్లాడిన ఈ మూవీ నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి.. గతంలో రిలీజ్ చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని, అదే బలంగా తీసుకొని ఇప్పుడు వాలెంటైన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశామని అన్నారు. తాను సినిమా రంగం లోకి రావడానికి ప్రధానంగా తన తాతగారు కీ//శే // శ్రీ కొవ్వూరి దానరెడ్డి (శ్రీ వెంకటరమణ ఆర్ట్స్ అసోసియేషన్, కొంకుదురు 1969), నాటక రంగ దర్శకులు, నటులు స్ఫూర్తి అని నిర్మాత భువన్ రెడ్డి చెప్పారు.
బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.