పురాణాలకు టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో తెలియజెప్పడమే మా సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు శ్రీ హర్షిత మూవీస్, కళా మూవీ మేకర్స్ నిర్మాతలు పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు. వారి నిర్మాణ సారథ్యంలో బాల పొలుబోయిన దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK). ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కన్నడ హీరో సిద్ధార్థ్ మహేష్ క్లాప్ కొట్టగా.. ప్రొడక్షన్ హెడ్ రాజ్యలక్ష్మీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూనిట్‌కు స్ర్కిప్ట్ అందించారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘టీమ్ అంతా కొత్తవాళ్లం. టాలెంట్‌కు బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని చెప్పేలా.. మేమంతా కష్టపడుతున్నాం. కంటెంట్ ఉంటే కచ్చితంగా అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాము. సినిమా విషయానికి వస్తే.. మన పురాణాలు, ఇతిహాసాలన్నింటిని.. సైన్స్ అండ్ టెక్నాలజీతో బ్యాలెన్స్ చేసి తయారు చేసిన స్క్రిఫ్ట్‌తో ఓ ఫ్యూజన్ జోనర్‌ని పరిచయం చేయబోతున్నాం. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండియన్ సినిమాకు ఈ సినిమాతో సరికొత్త స్ర్కీన్‌ప్లే విధానాన్ని పరిచయం చేయబోతున్నాం. తప్పకుండా మా ప్రయత్నం విజయవంతం అవుతుందని భావిస్తున్నాం. మా ఈ చిత్ర ఓపెనింగ్‌కు వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..’’ అని తెలిపారు.