నటుడు ప్రకాష్ రాజ్ విజయ రహస్యం ఏమిటంటే..?

ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించి నటుడిగా ప్రకాష్ రాజ్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. నేడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఆయనకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన ప్రకాష్ రాజ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించారు. బ్రతకడం కొరకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించారు.

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఇద్దరు సినిమా ప్రకాష్ రాజ్ కు సక్సెస్ ను తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డు రావడానికి కారణమైంది. ఈ మధ్య కాలంలో రంగస్థలం, సరిలేరు నీకెవ్వరు సినిమాలలోని పాత్రలు ప్రకాష్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకవైపు నటుడిగా కొనసాగుతూ ప్రకాష్ రాజ్ దర్శకుడిగా కొన్ని సినిమాలను తెరకెక్కించారు. నాను నాన్న కనసు అనే చిత్రాన్ని ప్రకాష్ రాజ్ తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నచ్చిన కథలను నిర్మిస్తూ కొన్ని సినిమాలకు ప్రకాష్ రాజ్ నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. మొదట దయ అనే తమిళ చిత్రాన్ని నిర్మించిన ప్రకాష్ రాజ్ ఆ తరువాత తన ఇష్టానికి అనుగుణంగా కొన్ని సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కేజీఎఫ్ 2, పుష్ప, వకీల్ సాబ్, అన్నాత్తే, ఇతర సినిమాల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు వచ్చాయి.కర్ణాటక రాష్ట్రంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ప్రకాష్ రాజ్ జన్మించారు. ప్రకాష్ రాజ్ మొదట డిస్కో శాంతి సోదరి అయిన లలిత కుమారిని వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయారు. సక్సెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ నచ్చినట్టు బ్రతకడమే సక్సెస్ సీక్రెట్ అని చెబుతారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus