Prakash Raj, Manchu Vishnu : మా అధ్యక్షుడు పనితీరుపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్?

గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పాలి. ఇలా మా అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా హీరో మంచు విష్ణు అలాగే నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు లభించడంతో ఈయన పోటీకి దిగినప్పటికీ మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇలా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏడాది పూర్తి అయిన అనంతరం ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు 90% పనులు పూర్తి చేశానని ఇక త్వరలోనే మా బిల్డింగ్ కూడా నిర్మించబోతున్నామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇకపోతే మా అధ్యక్షుడిగా విష్ణు పనితీరుపై నటుడు ప్రకాష్ రాజ్ సంధిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ప్రకాష్ స్పందిస్తూ మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయి ఇంకా ఏడాది మాత్రమే పూర్తి అయింది. మరొక ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.ఇలా మరో ఏడాది వరకు ఆయన పదవిలో కొనసాగుతూ ఏం చేస్తారనే విషయాలన్నింటినీ గమనిస్తూ ఉండాలని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇప్పటికే 90% ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు విష్ణు తెలిపారు. ఇలా హామీలను నెరవేర్చమని చెప్పుకుంటే చాలదు చేసి చూపించాలని ఈయన వెల్లడించారు.

ఊరకనే చేశామంటే చేసినట్టు కాదని మంచు విష్ణు పనితీరు పట్ల ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గత ఏడాది జరిగిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓడిపోగా వచ్చే ఎన్నికలలో మీరు పోటీ చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఈయనకు ఎదురు కాగా ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానం చెబుతూ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కదా చూద్దాం అంటూ ఆయన నవ్వేశారు. మరి వచ్చే ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మరోసారి పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus