Prakash Raj: ప్రకాష్ రాజ్ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రకాష్ రాజ్ వల్లే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటనకు మంచి పేరు వచ్చింది.

అయితే ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సరిలేరు నీకెవ్వరు లాంటి కమర్షియల్ మూవీస్ లో అబద్ధాలు చెప్పే పాత్రలో నటించడం నాకు కష్టంగా అనిపించిందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మూస పాత్రలలో నటించడం నాకు ఇష్టం ఉండదని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు. ఆ పాత్రలను ఏదో తప్పక చేస్తామని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఇష్టం లేకుండానే నటించానని ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పేశారు.

మేజర్, బొమ్మరిల్లు, కాంజివరం, ఆకాశమంత సినిమాలలోని పాత్రలు నాకు ఎంతో ఇష్టమని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలలో ఒక లైఫ్ ఉంటుందని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేజర్ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన మేజర్ ఉన్నికృష్ణన్ పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది.

అయితే ప్రకాష్ రాజ్ సరిలేరు నీకెవ్వరు సినిమా పేరును ప్రస్తావించకుండా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని సమాచారం అందుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus