Prakash Raj: చంద్రయాన్3 గురించి ప్రకాశ్ రాజ్ అలాంటి కామెంట్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన ప్రకాశ్ రాజ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా గతంతో పోల్చి చూస్తే ప్రకాష్ రాజ్ కు తెలుగు సినిమాలలో ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ తాజాగా చంద్రయాన్3 గురించి ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చంద్రయాన్3 మరికొన్ని గంటల్లో చంద్రునిపై అడుగుపెట్టనుంది. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై చంద్రయాన్3 అడుగుపెట్టనుండటంతో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 వైపు ప్రపంచ దేశాలు సైతం చూస్తున్నాయి.

ఈ ప్రయోగం సఫలమైతే మన దేశ ఖ్యాతి మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రష్యా లూనా 25 విఫలమైన నేపథ్యంలో చంద్రయాన్3 కు అనుకూల ఫలితాలు రావాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి విచిత్రంగా టీ పోస్తున్న కార్టూన్ ను షేర్ చేయడంతో పాటు “బ్రేకింగ్ న్యూస్.. చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం విక్రమ్ ల్యాండర్.. వావ్” అని పేర్కొన్నారు.

ఇస్రో ప్రయోగాన్ని కించపరిచేలా ఉన్న ఈ పోస్ట్ పై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. మన దేశానికి చంద్రయాన్3 గర్వ కారణం కాగా ప్రకాష్ రాజ్ శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీని విమర్శించడం కోసం ప్రకాష్ రాజ్ చంద్రయాన్3 ను టార్గెట్ చేయడం సరికాదని కొంతమంది చెబుతున్నారు.

ప్రకాష్ రాజ్ (Prakash Raj) తన ఆలోచన తీరును మార్చుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగులో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పొలిటీషియన్ రోల్ లో ఆయన కనిపించనున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus