Prakash Raj: అప్పు పేరుతో అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టిన ప్రకాష్ రాజ్!

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు.కన్నడ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పునీత్ బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇక ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించుకున్నారు.

ఇలా మంచితనానికి మారుపేరుగా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ కు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్టోబర్ 29వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన మరణించిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగాలి అంటూ ఇప్పటికే యంగ్ హీరో విశాల్ వంటి వారు పునీత్ చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజు సైతం పునీత్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ జన్మదినోత్సవం రోజున ఆయన జ్ఞాపకార్థం మార్చి 26వ తేదీ అప్పు ఎక్స్ ప్రెస్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ పై అభిమానంతో ప్రకాష్ రాజ్ అప్పు ఎక్స్ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇదే కాకుండా ప్రకాష్ రాజ్ ఇప్పటికేప్రకాష్ రాజ్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా ఈయన అప్పు పై అభిమానంతో ఇలాంటి సేవలను ప్రారంభించడంతో ఎంతో మంది పునీత్ అభిమానులు, పెద్ద ఎత్తున ఇతనిపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే భాషతో పని లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus