బాలీవుడ్‌ కోసం బాపు బొమ్మ రిస్క్‌ చేస్తోందా?

Advertisement

సినిమా కోసం బరువు తగ్గే నాయికల్ని చూడటం సర్వసాధారణం. అయితే సినిమా కోసం బరువు పెరిగే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటుంటారు. టాలీవుడ్‌లో అయితే ఇంకా తక్కువ. వాళ్లంతట వాళ్లు బరువు పెరగడం తప్ప, సినిమా కోసం పెరిగిన సందర్భాలూ చాలా తక్కువ. అయితే తాజాగా బాపు బొమ్మ ప్రణీత ఆ ప్రయత్నం చేయబోతోంది. అయితే టాలీవుడ్‌ కోసం కాదు, బాలీవుడ్‌ కోసం. ఇటీవల ప్రణీత బాలీవుడ్‌కు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాని కోసం ఈ బరువు పెరుగుతోంది.

అజయ్‌ దేవగణ్‌ హీరోగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. 1971 నాటి యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో నాయికగా ప్రణీతను ఎంచుకున్నారు. ఈ సినిమాలో ప్రణీత రెండు భిన్న పాత్రల్లో కనిపించబోతోంది. అందులో ఓ పాత్ర కోసం ప్రణీత కాస్త లావుగా కనిపించాల్సి ఉందట. దీని కోసం 20 నుంచి 25 కిలోల బరువు పెరగనుందని సమాచారం. సినిమా కోసం నిబద్దతతో ఇలా బరువు పెరగడం మంచి ఆలోచనే కావొచ్చు. అయితే గత ఉదంతాలను దృష్టిలో పెట్టుకుంటే కష్టమే అని చెప్పాలి.

సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్లు ఆ తర్వాత రాణించలేక పోయారనేది కొట్టిపారేయలేని విషయం. చాలామంది నాయికలు బరువు పెరిగిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి పెద్దగా కనిపించకుండా పోయారు. తాజా ఉదాహరణ అనుష్క. ‘సైజ్‌ జీరో’ సినిమా కోసం అమాంతం బరువు పెరిగిన అనుష్క… అప్పటి నుంచి మళ్లీ పాత రూపానికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికీ ఆమె శరీరం సెట్‌ అవ్వలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణీత ‘బరువు’ అలోచన చేయాలని అభిమానులు సూచిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో భూమి పెడ్నేకర్‌ లాంటి వాళ్లు తగ్గి చూపించిన విషయం గుర్తు పెట్టుకోవాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news