ఇన్నాల్టకి దశ తిరిగింది.. ప్రణీతకి బంపర్ ఆఫరే ఇది..!

చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు..ఆకట్టుకునే నటన కూడా ప్రణీత సొంతం. అయినప్పటికీ ఈమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. సరైన పాత్రలు ఎంపికచేసుకోకపోవడం వలనే ఈమె స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది అనేది ఎప్పటి నుండో విశ్లేషకులు చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, ఎన్టీఆర్ ‘రభస’, సూర్య ‘రాక్షసుడు’ రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాల్లో ఈమె పాత్రలను బట్టి ఈ విషయం నిజమే అని స్పష్టమవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్లో ప్రణీతకు ఒక్క అవకాశం కూడా లేదు. అయితే లాక్ డౌన్ టైములో మాత్రం ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. కరోనా టైములో పేద సినీ కళాకారులకు ఆర్ధిక సాయం చేసింది. స్వయంగా ఆమెనే వంట చేసి ఎంతో మంది ఆకలి తీర్చింది. అందుకే ఈమెను రియల్ హీరోయిన్ అన్నారు. ఆమె చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. అది కూడా స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న ‘బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ప్రణీత మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యింది.ఈ మధ్యకాలంలో అజయ్ దేవగన్ వరుసగా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇతను 3 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం చేస్తుండగానే ప్రణీతకు అక్కడ మరో ఆఫర్ కూడా లభించిందని సమాచారం.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus