Bigg Boss 7 Telugu: బాబోయ్ రతిక ప్రశాంత్ కి చుక్కలు చూపించింది..! లైవ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ అనేవి చాలా కామన్. నిన్న మొన్నటి దాకా సీజన్ 7లో రతికకి పల్లవి ప్రశాంత్ కి ఇద్దరి మద్యలో ఏదో ఉందనే భ్రమలో ఆడియన్స్ ఉన్నారు. వాళ్లిద్దరూ కూడా అలాగే బిహేవ్ చేశారు. అయితే, శనివారం ఎపిసోడ్ నుంచీ రతిక శివాజీపై శివాలెత్తిపోతోంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని నావిషయంలో ఎందుకు అన్నారంటూ నిలదీసింది. దీనికి నేను కావాలని అనలేదని టాపిక్ ప్రొలాంగ్ అవ్వకుండా కట్ చేశానని, నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పాడు శివాజీ.

ఇక నామినేషన్స్ అప్పుడు గౌతమ్ ని పల్లవి ప్రశాంత్ నామినేషన్ చేస్తుంటే తనని కూడా డ్రెస్ విషయంలో కామెంట్ చేశాడంటూ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చిపారేసింది. ఇక్కడే ఇద్దరి మద్యలో బాగా గొడవలు అయ్యాయి. పిల్లో పై PR అని ఎందుకు రాశావ్ అని అడిగింది. అడిగితే ఇది నాప్రొపర్టీ అని ఎందుకు అన్నావ్ అని కడిగేసింది. నీకు ఏది చెప్పినా అర్ధం కాదు ఎందుకంటే, బుర్రలో అంతా మట్టే ఉందని రెచ్చిపోయింది. దీనిని పల్లవి ప్రశాంత్ అవును నా బుర్రలో మట్టే ఉంది..

ఈ నెత్తిపై నీకు లేడీ లక్ బ్యాండ్ కట్టినప్పటి నుంచీ శని కూర్చుంది అంటూ దండం పెట్టాడు. ఇప్పటి వరకూ ఏదైతే చేశానో దానికి సారీ అంటూ చెప్పాడు ప్రశాంత్. ఇక ఏయ్.. ఓయ్ అని పిలుస్తున్నావ్ రెస్పక్ట్ లేదా.. అసలు నువ్వెవరు అంటూ రతిక నిలదీసింది. దీనికి పల్లవి ప్రశాంత్ ఇక నుంచీ అందరినీ పిలిచినట్లుగానే నిన్ను పిలుస్తా అని చెప్పాడు. అలాగే, అక్కా అంటా సరేనా అంటూ అక్కా అక్కా అని పిలిచాడు.

వీరిద్దరి మద్యలో శివాజీ రాయబారిగా వచ్చి గొడవని అక్కడితే ముగించాడు. ఇక ఆ తర్వాత మార్నింగ్ పల్లవి ప్రశాంత్ రతిక వెనకాలే పడ్డాడు. ఐయామ్ సారీ సారీ అంటూ పదిసార్లు వెంటబడి చెప్పాడు. అలాగే రతికని అక్కా అని అంటూ సంభోదించాడు. నిన్న మొన్నటిదాకా లవ్ స్టోరీ లాగా ట్రాక్ నడిపిన ఇద్దరూ ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా అవ్వడం ఏంటి అనేది ఆడియన్స్ కి అర్ధం కావడం లేదు.

బయట జనాలకి బ్యాడ్ గా వెళ్లిపోతోందని, అసలు పల్లవి ప్రశాంత్ నువ్వెవరు నాకు బయట కూడా పరిచయం లేదు.. ఏయ్ .. ఓయ్ అని పిలుస్తున్నావ్.. ఇలా రతిక అడిగేసరికి ఇంకెపుడు అలా పిలవను. మాములుగానే ఉంటా.. లేదంటే చీపిరికట్ట తిరగేయ్, చెప్పుతో కొట్టు అంటూ పల్లవి ప్రశాంత్ చెప్తుంటే ఈ డ్రామా వేరే లెవల్లోకి వెళ్లింది. మొత్తానికి నామినేషన్స్ లో ఎప్పటిలాగానే వీరిద్దరి (Bigg Boss 7 Telugu) ఎపిసోడ్ కూడా హైలెట్ అయ్యింది. మరి ముందు ముందు వారాల్లో ఇది దేనికి దారితీస్తుందనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus