Prashanth Neel: ఆ కమెడియన్ గురించి ప్రశాంత్ నీల్ అలా చెప్పారా?

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించగ్గ దర్శకులలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ నుఖాతాలో వేసుకోనున్నారు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల 28వ తేదీన సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం ఆ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.

సలార్ ఎప్పుడు విడుదలైనా 1500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సప్తగిరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ సినిమాలో తాను యాక్ట్ చేశానని తన నటనను చూసి ప్రశాంత్ నీల్ “బ్రదర్.. నువ్వు కమెడియన్ వి కాదు.. నువ్వో నటుడివి” అని చెప్పారని చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) చెప్పిన ఆ మాట నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిందని సప్తగిరి అన్నారు. సునీల్ అన్న కెరీర్ నాకు ఆదర్శం అని సునీల్ లా నా కెరీర్ ను మార్చుకోవాలని ఉందని ఆయన కామెంట్లు చేశారు. నాలో కమెడియన్ ను చూడవద్దని నటుడిని చూడండని చెప్పాలని ఉందని సప్తగిరి అన్నారు.

నా అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ అని తర్వాత రోజుల్లో సప్తగిరి అని మార్చుకున్నానని ఆయన తెలిపారు. సంతోషం, బాధ రెండూ పక్కపక్కనే ఉంటాయని సప్తగిరి చెప్పుకొచ్చారు. కొన్ని వెబ్ సైట్లలో నా గురించి రకరకల వార్తలు వస్తాయని ఆ వార్తలు రాయిస్తుందెవరో నాకు తెలుసని సప్తగిరి కామెంట్లు చేశారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus