Salaar: ఆ తప్పులు రిపీట్ చేశానని చెప్పిన ప్రశాంత్ నీల్.. ఏం జరిగిందంటే?

సలార్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ కు చేసిన తప్పులే సలార్ కు చేశానని ప్రశాంత్ నీల్ అన్నారు. కేజీఎఫ్ మూవీ సమయంలో సినిమా మొత్తం చూడటానికి ఆ సినిమాలో మార్పులు చేయడానికి మాకు సమయం లేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విషయంలో కూడా అదే గజిబిజి పరిస్థితిలో ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు.

అయితే మేము చేసిన దాని విషయంలో మాత్రం సంతోషంగా ఉన్నామని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కేజీఎఫ్ సిరీస్ విషయంలో ప్రశాంత్ నీల్ చేసిన తప్పులు ఏంటో మాత్రం తెలియడం లేదు. యూట్యూబ్ లో సలార్ రిలీజ్ ట్రైలర్ ప్రభంజనం కొనసాగుతోంది. ఫ్యాన్స్ కు ఎంతగానో ఈ ట్రైలర్ నచ్చేసింది. అభిమానులు సలార్ నుంచి ఏం కోరుకున్నారో అదే విధంగా ట్రైలర్ ఉంది.

సినిమాలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవకు దారి తీసే పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం సినిమా చూస్తే మాత్రమే జవాబు దొరుకుతుందని చెప్పవచ్చు. సలార్ సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వెళ్లినా ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

సలార్ రిలీజ్ తో బాక్సాఫీస్ షేక్ అవుతుందేమో చూడాలి. బాహుబలి2 రిలీజ్ సమయంలో టికెట్స్ కోసం ఏ స్థాయిలో పోటీ నెలకొందో సలార్ మూవీ కోసం కూడా అదే స్థాయిలో పోటీ నెలకొందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus