Prashanth Neel, Jr NTR: ఎన్టీఆర్ డ్రాగన్ పని ఎంతవరకు వచ్చింది?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  – ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద ఫ్యాన్స్‌ అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. RRR దేవర (Devara) హిట్స్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న మరో బిగ్ పాన్ ఇండియా సినిమాగా ఈ ప్రాజెక్ట్ భారీ హైప్‌ను తెచ్చుకుంది. అలాగే కేజీఎఫ్వం(KGF) ‘సలార్’ (Salaar) టి బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఫస్ట్ సినిమా ఇదే కావడంతో సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.

Prashanth Neel, Jr NTR

ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. టైటిల్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా, ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో ఇదే పేరు చర్చలో ఉంది. రుక్మిణి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, ప్రశాంత్ నీల్‌తో గత చిత్రాల్లో పనిచేసిన టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకూ వర్క్ చేస్తున్నారు. దీంతో విజువల్స్ హై స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ నెల 22న ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మూడువారాల భారీ షెడ్యూల్ మే 15 వరకూ కొనసాగనుంది. ఇందులో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సీన్‌ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని యూనిట్ చెబుతోంది.

ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చడంతో పాటు బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాంకేతికంగా, విజువల్స్ పరంగా అన్ని హంగులు జోడిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ రిలీజ్ ప్లాన్ సంక్రాంతి 2026గా ఉన్నా, ప్రస్తుతం వేసవి రిలీజ్ కూడా పరిశీలనలో ఉందన్న సమాచారం. షూటింగ్ స్పీడ్ చూస్తే వేసవి చాన్స్ బలంగా కనిపిస్తోంది.

ఇక డ్రాగన్ టైటిల్ గ్లింప్స్‌ను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద అంచనాలు ఉండటమే కాకుండా, ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లోని మరో టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజువల్ ఫీస్ట్‌తో పాటు మాస్ మూడ్‌లో వచ్చే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది.

జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus