Salaar Movie: ప్రభాస్ మూవీలో ఆ హీరో నటిస్తున్నారా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్, శృతిహాసన్ జంటగా సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ కొంతభాగం జరగగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఒకరు కనిపిస్తారని ఆ హీరో పాత్ర కోసం స్క్రిప్ట్ లో ప్రశాంత్ నీల్ అదనపు సన్నివేశాలను యాడ్ చేశారని తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీనియర్ హీరో కనిపిస్తారని సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలెట్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేస్తున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటాయని సమాచారం.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యమైనా చెప్పిన తేదీకే ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రీఎంట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న తొలి సినిమా సలార్ కావడం గమనార్హం. ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus